బిజీ లైఫ్ కారణంగా డైట్ కూడా చాలా మారిపోయింది. పని ఒత్తిడి కారణంగా రోజు వండుకుని తినే పరిస్థితిలేదు. చాలా మంది మార్కెట్లో దొరికే క్యాన్ ఫుడ్ తింటుంటారు. ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీంతో సమయం దొరికినప్పుడు వండుకుని తింటుంటారు. ఇక రాత్రి మిగిలి పోయిన అన్నం, కూరలు వంటి వాటిని ఫ్రిజ్లో భద్ర పరచడం మనందరం చేసే పనే.
ఇలా భద్రపరచిన ఆహారాన్ని మరుసటి రోజు కాస్త వేడి చేసుకుని తింటుంటారు. ఐతే ఫ్రిజ్లో నిల్వ చేసిన ఆహారాన్ని మళ్లీ వేడిచేసుకుని తినడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తాయని మీకు తెలుసా..?
రిఫ్రిజిరేటెడ్ ఆహారాన్ని పదేపదే వేడి చేయడం వల్ల దానిలోని పోషకాలు నాశనం కావడమే కాకుండా, శరీరంలో వివిధ సమస్యలకు కారణం అవుతుంది. ఇది క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి, సమతుల్య దినచర్య, మంచి ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యం.
కానీ చాలాసార్లు మనం చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ పెట్టకపోవడం వల్ల పెద్ద సమస్యలను కొని తెచ్చుకుంటుంటాం. ఆహారాన్ని రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయడం, పదేపదే వేడి చేయడం అంత మంచి పద్ధతి కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఫ్రిజ్లో ఉంచి తిరిగి వేడి చేసి తినకూడని ఆహారాలు ఇవే..
చేపలు, మాంసం వంటి నాన్ వెజ్ ఆహారాలను ఒక సారి వండిన తర్వాత ఫ్రిజ్లో దాచుకుని రెండు మూడు రోజులు తింటుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం. చేపలు, మాంసాన్ని రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసి, తిరిగి వేడి చేసి తినడం వల్ల అది విషంగా మారుతుంది. ఇది శరీరంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.