ఐస్ క్రీమ్ తర్వాత అందరు ఎక్కువగా ఇష్టపడేది కూల్ డ్రింక్స్.. కూల్ డ్రింక్స్‌లో చక్కెర ఎక్కువగా ఉంటుంది తప్ప ఎలాంటి పోషకాలు ఉండవు. ఈ పానీయాలు కేవలం బరువు పెంచుతాయి తప్ప… ఎలాంటి ప్రయోజనాలు ఉండవు అని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేసిన అధ్యయనంలో తేలింది. మితిమీరి కూల్ డ్రింక్స్ తాగే పురుషులకు గుండె జబ్బు వచ్చే ప్రమాదం 20 శాతం వరకు పెరుగుతుంది.. బరువు పెరుగుతారు.. ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు తలేత్తుతాయని చెబుతున్నారు.. అవేంటో వివరంగా తెలుసుకుందాం..
మానవ శరీరం ఎప్పుడూ దృడంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ చాలా అవసరం.. కూల్ డ్రింక్స్ తాగితే ప్రోటీన్ లోపం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.. ఇక వీటికి బదులుగా పుచ్చకాయ, కర్బూజ పండ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. వీటిలోనూ చక్కెర లేకుండా తాగితే మరీ మంచిది. సాధ్యమైనంత వరకు మంచి నీటిని ఎక్కువగా తాగేందుకు ప్రయత్నించాలని చెబుతున్నారు..
ఎముకల పెరుగదలకు ఫాస్ఫరస్ ముఖ్యమైనది, ఎముకల అభివృద్ధికి తగినంత ఫాస్ఫరస్ తీసుకోవడం చాలా ముఖ్యం. తక్కువ సీరం ఫాస్ఫేట్ స్థాయిలు పోషకాహార లోపాన్ని సూచిస్తాయి, ఇది ఎముకల పగుళ్లు, బోలు ఎముకల ప్రమాదాన్ని పెంచుతుంది.