ఐ, 2.ఓ, రామ్ చరణ్ ఎవడు, విజయ్ తేరి (తెలుగులో పోలీసోడు) వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది ఎమీ జాక్సన్. కానీ తన పర్సనల్ లైఫ్, పెళ్లి కాకుండా తల్లి కావడం, మళ్లీ బ్రేకప్, మళ్లీ ప్రేమలో పడటం వంటి విషయాలతోనే ఎక్కువగా ఫేమస్ అయింది. ఇప్పుడు తన ప్రియుడు, తన కొడుకుతో కలిసి సంతోషంగా కాలాన్ని గడిపేస్తోంది ఎమీ జాక్సన్.
వ్యక్తిగత కారణాల వల్ల ఇన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది ఎమీ జాక్సన్. తన సొంత దేశానికి వెళ్లి ఉంటోంది. కానీ ఇప్పుడు మళ్లీ సినిమాల మీద ఫోకస్ పెట్టాలని ఫిక్స్ అయినట్టుంది. అరుణ్ విజయ్ హీరోగా వస్తోన్న చిత్రంలో ఎమీ జాక్సన్ నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తయినట్టుగా కనిపిస్తోంది.
తాజాగా ఎమీ జాక్సన్ కొత్త లుక్కులో కనిపించి షాక్ ఇచ్చింది. తన జుట్టునంతా కత్తిరించుకుంది. ఏదైనా సినిమా కోసం ఇలా ప్రయత్నిస్తోందా? అన్నది తెలియడం లేదు. కానీ ఆమె కొత్త లుక్ మాత్రం అందరినీ షాక్‌కు గురి చేసింది. అసలు ఆమెను గుర్తు పట్టే వీలే లేనట్టుగా ఉంది. ఇక ఆమె లుక్ చూసిన కొందరు ఓపెన్హ్యామర్ సినిమాలోని హీరోలా ఉన్నావ్.. ఆ నటుడిలానే కనిపిస్తున్నావ్ అని ట్రోల్స్ చేస్తున్నారు. ఆ కామెంట్లకు సైతం ఎమీ ఫన్నీగా రియాక్ట్ అయింది.
మీ జాక్సన్ కనిపించిన కొద్ది రోజులు బాగానే సందడి చేసింది. వరుసగా టాప్ హీరోలతో నటించింది. కోలీవుడ్, టాలీవుడ్లో బాగానే క్రేజ్ దక్కించుకుంది. ధనుష్, విక్రమ్, రామ్ చరణ్ వంటి వారితో నటించింది. మరీ ముఖ్యంగా శంకర్ సినిమాల్లో మెరిసింది. కానీ ఆ సినిమాలు అంతగా హిట్ కాకపోవడంతో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఆమె బ్రిటీషర్ కనిపించడం కూడా కొన్ని సినిమాలకు కలిసి వచ్చింది. ఆర్యతో కలిసి 1947 సినిమాలో నటించింది. ఆ కారెక్టర్ ఆమెకు కరెక్ట్‌గా సెట్ అయిందనే కామెంట్లు వచ్చాయి.