వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రారంభానికి ముందు భారత్, ఆస్ట్రేలియా జట్లు తమ చివరి సిరీస్‌లో పరస్పరం తలపడబోతున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు జరిగే 3 వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ నేడు ప్రారంభం కానుంది. మొహాలీ వేదికగా జరిగే నేటి మ్యాచ్ కోసం ఇరు జట్లు సన్నద్ధంగా ఉన్నాయి.
తొలి రెండు మ్యాచ్‌లకు రోహిత్ శర్మ దూరంగా ఉండడంతో టీమిండియాను కేఎల్ రాహుల్ నడిపిస్తుండగా.. దక్షిణాఫ్రికా సిరీస్‌లో జట్టుకు దూరమైన ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తిరిగొచ్చాడు. ఇక భారత్ తొలి రెండు వన్డేలను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా లేకుండానే ఆడుతుండగా.. మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ లేకుండా ఆసీస్ నేటి మ్యాచ్ ఆడనుంది.
వన్డేల్లో భారత్‌పై ఆస్ట్రేలియాదే పైచేయి. ఇరు జట్లు ఇప్పటివరకు 146 మ్యాచ్‌లు ఆడగా.. 82 ఆసీస్, 54 భారత్ గెలిచించి. మిగిలిన 10 మ్యాచ్‌ల్లో ఫలితం తలలేదు. వీటిల్లో భారత్‌లో ఆడిన మ్యాచ్‌లే 67 ఉండగా.. ఇక్కడ కూడా కంగారులదే అధిపత్యం. భారత్ వేదిగా జరిగిన 67 మ్యాచ్‌ల్లో 32 ఆసీస్, 30 టీమిండియా గెలవగా.. మరో 5 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.