ఇండోర్ లో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ 99 పరుగుల తేడాతో గెలిచింది. 217 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. దీంతో 99 పరుగుల తేడాతో ఇండియా గెలుపొందింది. ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా 3 వికెట్లు, అశ్విన్ కు 3, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీయగా.. షమీ ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్ గెలిచి భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. మధ్యలో వర్షం ఆటంకం కలిగించినప్పటికీ మ్యాచ్ కాసేపు ఆపేశారు. ఆ తర్వాత వర్షం తగ్గడంతో తిరిగి ప్రారంభమైంది. మరోవైపు డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఓవర్లను తగ్గించారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 9 ఓవర్ల తర్వాత వర్షం రావడంతో ఆస్ట్రేలియా 33 ఓవర్లలో 317 పరుగులకు కుదించారు.
వర్షం ఆగిన తర్వాత మళ్లీ ఆట ప్రారంభం కాగానే ఆస్ట్రేలియా 144 బంతుల్లో 261 పరుగులు చేయాల్సి ఉంది. డేవిడ్ వార్నర్, మార్నస్ లాబుషాగ్నే క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ ఆరంభంలోనే వేగంగా పరుగులు చేయడం ప్రారంభించారు. ఓ దశలో ఆస్ట్రేలియా జట్టు మ్యాచ్‌ని తనవైపుకు తీసుకెళ్తుందని అనిపించినా.. ఆ తర్వాత అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో మ్యాచ్‌ని మలుపుతిప్పారు. భారత్ అద్భుత బౌలింగ్ ప్రదర్శన ముందు ఆస్ట్రేలియా 140 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. అయితే చివరిలో సీన్ అబాట్, జోష్ హేజిల్‌వుడ్ ఓటమి మార్జిన్‌ను తగ్గించారు. అబాట్ 36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేశాడు. జోష్ హేజిల్‌వుడ్ (23)తో కలిసి 9వ వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
మరోవైపు ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్ వార్నర్ అర్ధ సెంచరీ ఔటైన వెంటనే.. అందులోని ప్లేయర్లు వెంటవెంటనే పెవిలియన్ బాటపట్టారు. మార్నస్ లాబుస్చాగ్నే (27), జోష్ ఇంగ్లిస్ (06), అలెక్స్ కారీ (14), కెమెరాన్ గ్రీన్ (19), ఆడమ్ జంపా (05) పరుగులు మాత్రమే చేశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 399 పరుగుల భారీ స్కోరు చేసింది. శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ అద్భుత సెంచరీలతో స్కోరు భారీగా వెళ్లింది. అటు కేఎల్ రాహుల్, సుర్యకుమార్ యాదవ్ కూడా హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారత్ ఇన్సింగ్స్ లో రుతురాజ్ గైక్వాడ్(8), శుభ్ మన్ గిల్ (104), శ్రేయస్ అయ్యర్(105), రాహుల్(52), ఇషాన్ కిషన్(31), సూర్యకుమార్ యాదవ్(72), రవీంద్ర జడేజా(13) పరుగులు చేశారు.