ట్రాఫిక్‌లో చిక్కుకున్నందున మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించే సమయానికి పార్లమెంటుకు తాము చేరుకోలేకపోయినట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. అదే సమయంలో 66 మంది భాజపా ఎంపీలు లోక్‌సభలో ఎందుకు లేరో కిషన్‌రెడ్డి జవాబివ్వాలని డిమాండు చేశారు.
తెలంగాణ కోసం రాజీనామా చేయని కిషన్‌రెడ్డికి తమను విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. కిషన్‌రెడ్డి కాంగ్రెస్‌పై చేసిన విమర్శలపై కోమటిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతిచ్చిందని స్వయంగా సోనియా, రాహుల్‌లు సభలో చెప్పారని గుర్తుచేశారు.
అనవసరంగా కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలని కిషన్‌రెడ్డి విమర్శలు చేస్తున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని చెప్పిందే కాంగ్రెస్ అని స్పష్టం చేశారు.