డైరెక్టర్ ఆర్జీవీ ఏం చేసినా.. చాలా డిఫరెంట్గా చేస్తుంటాడు. అతను వివాదస్పద డైరెక్టర్ మాత్రమే కాదు.. మంచి రొమాంటిక్ పర్సన్ కూడా. తన సినిమాలు, వెబ్ సీరిస్ లలో అందమైన అమ్మాయిలను, బోల్డ్ హీరోయిన్స్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంటాడు. అంతేకాదు.. తన సినిమా ప్రమోషన్స్ కు కూడా అందమైన అమ్మాయిలను వాడుకోవడం, వారితో రెచ్చగొట్టే లా ప్రవర్తించడం వర్మకే సాధ్యం. వర్మ కన్ను పడితే ఇక అంతే సంగతులు అన్నట్టుగా ఉంటుంది.
తాజాగా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన అమ్మాయిపై వర్మ కన్ను పడింది. వర్మ పోస్ట్ చేసిన వీడియోలో అమ్మాయి శారీ కట్టుకోని, ఒక కెమెరా పట్టుకోని… అటు ట్రెడిషనల్ కి, ఇటు హాట్ నెస్ కి మధ్యలో ఉంది. ఆ అమ్మాయి నాభి అందాలను ప్రదర్శించడం వీడియోలు చూడొచ్చు. వర్మ ఒక అమ్మాయి గురించి అడిగడంతో కుర్రాలు రెచ్చిపోయి కామెంట్స్, రీట్వీట్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో కేవలం గంటల్లోనే ట్రెండింగ్ లో దూసుకుపోయింది.
వర్మ కెన్ యు టెల్ మీ.. వూ ఈజ్ షీ అని క్యాప్షన్ ఇవ్వగా, “శ్రీలక్ష్మి సతీష్” ఇన్స్టా మోడల్, కేరళకి చెందిన అమ్మాయి అంటూ ఫుల్ డీటైల్స్ ఇచ్చేసారు. దీంతో ఏ రాజా ఈ అమ్మాయికి కూడా బ్రేక్ ఇస్తావా అంటూ నెటిజన్స్ కొందరు కామెంట్స్ చేయడం ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆర్జీవీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవేళ ఆ అమ్మాయి కనుక వర్మ బుట్టలో పడితే మరో బోల్డ్ సినిమాలో కనిపించడం ఖాయమేనని అంటున్నారు సినీ అభిమానులు.