ఆస్ట్రేలియాపై వరుసగా రెండు వన్డేల్లో గెలిచిన భారత్.. రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడో వన్డేలో 66 పరుగుల తేడాతో ఓడిపోయింది. క్లీన్ స్వీప్ చేయాలని భావించిన టీమ్ ఇండియా ఆశలు నెరవేరలేదు.. 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 49.4 ఓవర్లలో 286 పరుగులకే ఆలౌటైంది.
టీమిండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ 81 పరుగులతో దూకుడుగా ఆడగా విరాట్ కోహ్లీ హాప్ సెంచరీతో రాణించాడు. ఇక, శ్రేయస్ అయ్యార్, రవీంద్ర జడేజా ఫర్వాలేదనిపించారు. కానీ.. మిగిలిన వారిలో కేఎల్ రాహుల్ , వాషింగ్టన్ సుందర్, సూర్యకుమార్ యాదవ్ విఫలం అయ్యారు.
మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మిచెల్ మార్ష్ 96 పరుగులు, స్టీవ్ స్మిత్ 74 పరుగులు, లబుషేన్ 72 పరుగులు, డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీతో రాణించారు. ఇక, భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ రెండు, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీసుకున్నారు. టీమిండియా ఈ మ్యాచ్ ఓడిపోయినప్పటికి 2-1తో వన్డే సిరీస్ను సొంతం చేసుకుంది.