దేశంలోని పిల్లలు స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోతున్నారు. రోజులో సగం సమయాన్ని స్మార్ట్ఫోన్లలోనే గడిపేస్తున్నారు. డిజిటల్ క్లాసులు, సోషల్ మీడియా, గేముల కారణంగా పిల్లలు ఎక్కువగా వీటికి అలవాటు పడ్డారని హ్యాపీనెట్జ్ అనే సంస్థ తెలిపింది.
డిజిటల్ క్లాసులు, హోమ్ వర్క్ చేసేందుకు, చాటింగ్, గేమ్‌లు, వీడియోలు చూసేందుకు స్మార్ట్ఫోన్లకు ఎక్కువగా వాడుతున్నారని పేర్కొంది. 12 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు క్యాటగిరీకి సంబంధించి చేసిన సర్వే వివరాలను తాజాగా వెల్లడించింది.
– సర్వేలో పాల్గొన్న తల్లిదండ్రుల సంఖ్య 1500
– స్మార్ట్ఫోన్లను వాడుతున్న పిల్లలు 42%
– రోజులో ఎన్ని గంటలు 2.4
– యూట్యూట్ చూస్తున్న వారు 74%
– సొంత స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు ఉన్నవారు 69%
– గేమ్‌లు ఆడుతున్న వారు 61% అని సర్వేలో తేలింది.