తప్పుడు ఇంజెక్షన్ కారణంగా ఇంటర్ విద్యార్థిని దుర్మరణం పాలైంది. ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగా 17ఏళ్ల యువతికి నిండు నూరెళ్లు నిండిపోయాయి. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో చోటు చేసుకుంది. బాలిక మరణించిన తర్వాత మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు బైక్‌పై ఉంచింది ఆస్పత్రి సిబ్బంది.
ఆ బాలిక మృతదేహానికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో కలకలం రేగింది. తప్పుడు ఇంజెక్షన్ వల్లే బాలిక చనిపోయిందని ఆరోపించారు. అందువల్లే ఆసుపత్రి సిబ్బంది ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి బయట బైక్‌పై వదిలేశారని ఆందోళనకు దిగారు. జిల్లాలోని ఘీరోర్కు చెందిన గిరీష్ కుమార్తె 17 ఏళ్ల ఆరోగ్యం క్షీణించడంతో కర్హల్ రోడ్‌లోని రాధా స్వామి ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
బాలిక 12వ తరగతి చదువుతున్న భారతిగా తెలిసింది. మంగళవారం ఆమెకు తీవ్ర జ్వరం రావటంతో కుటుంబ సభ్యులు ఆమెను ఘిరోర్లోని రాధా స్వామి ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స ప్రారంభించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్పత్రిలో చికిత్స విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే భారతి మృతి చెందిందని, ఆస్పత్రి నిర్వాహకులు కుటుంబీకులకు సమాచారం ఇవ్వకుండా భారతిని బయటకు తీసుకెళ్లి ఆస్పత్రి ఆవరణలోని పార్కింగ్‌లో ఉన్న ఓ బండిపై వదిలేశారు.