శ్రీకాకుళంలోని కొత్తూరు పాలకొండ రోడ్డులోని దుర్గా జ్యూయలర్స్ దుకాణానికి ఏకంగా రూ.1,01,56,116 విద్యుత్తు బిల్లు వచ్చింది. ఈ బిల్లు గత నెల 2వ తేదీ నుంచి ఈనెల 2వ తేదీ వరకు తీసిన రీడింగ్‌కు సంబంధించినది. ఈ బిల్లును దుకాణ యజమాని గుడ్ల అశోక్‌కు సోమవారం విద్యుత్తు సిబ్బంది అందించారు. దీనిని చూసిన ఆయన అవాక్కయ్యారు.
ఏకంగా కోటి రూపాయల విద్యుత్తు తామెక్కడ వాడామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సగటున రూ.7 నుంచి రూ.8 వేల వరకు బిల్లు వస్తుంటుందని, ఏకంగా ఇంత మొత్తంలో రావడం ఏమిటని విద్యుత్తు శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ట్రాన్స్ ఏఈ లక్ష్మణరావు మాట్లాడుతూ బిల్లును సరిచేస్తామన్నారు.