తన చిలుక కనిపించడం లేదని ఓ యజమాని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఒక రోజు వ్యవధిలోనే దాని జాడ గుర్తించి యజమానికి అప్పగించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జూబ్లీహిల్స్ ఎస్సై ముత్యాల మెహర్ రాకేష్ తెలిపిన మేరకు.. రోడ్ నం.44లో నివసించే నరేంద్రచారి మైరు బిస్ట్రో కాఫీ షాప్ నిర్వహిస్తున్నారు.
ఆయన ఆస్ట్రేలియా జాతికి ఎందిన గాలా రాక్టో అనే 4 నెలల వయసున్న చిలుకను రూ.1.30లక్షలకు కొనుగోలు చేసి పెంచుకుంటున్నారు. సెప్టెంబరు 22న ఆహారం పెట్టే సమయంలో పంజరం నుంచి ఎగిరిపోయింది. ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు 24న ఫిర్యాదు చేశారు. దాని ఫొటోను వారికి అందించారు.
ఎస్సై ఫొటోను స్థానిక పక్షులు, జంతువుల విక్రయ దుకాణదారులకు పంపారు. ఎర్రగడ్డలో రూ.30వేలకు ఓ వ్యక్తి ఈ చిలుకను విక్రయించాడు. ఆ వ్యక్తి మర్నాడు రూ.50వేలకు సయ్యద్ ముజాహిద్‌కు విక్రయించాడు. అతను దీనిని రూ.70వేలకు అమ్ముతానని వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. జూబ్లీహిల్స్‌లోని పెట్ షాప్ నిర్వాహకుడు ఎస్సైకి సమాచారం అందించడంతో ఆయన 25న చిలుకను స్వాధీనం చేసుకుని నరేంద్రచారికి అప్పగించారు.