SRIKAKULAM | నకిలీ బంగారు నగలతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలు పోలీసులకు చిక్కారు. ప్రస్తుతం వారిని నరసన్నపేట పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇద్దరు మహిళలు కొన్ని బంగారు నగలతో పాటు, fake gold బ్యాగులో వేసుకుని సంచరిస్తారు.
బంగారు దుకాణాలు, ఇతర కొనుగోలు దారులను ఎంపిక చేసుకుని అసలైన నగలు చూపి అమ్మకానికి పెడతారు. ఎంతో నమ్మశక్యంగా వ్యవహారం నడిపి విక్రయించే సమయానికి నకిలీ నగలను అప్పగిస్తారు. తాజాగా నరసన్నపేటలో జరిగిన ఘటనతో వీరి బండారం బయటపడింది.
చెన్నైకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు సభ్యులు ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. తల్లి, ముగ్గురు కుమార్తెలు, అల్లుడు నగల అపహరణలో ఆరితేరి cheating పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. గత నెల 26, 27వ తేదీల్లో పలాస, SRIKAKULAMలోని బంగారు దుకాణాల్లో నగలు అపహరించగా, 30న నరసన్నపేటలోని సాయి స్వర్ణ ప్యాలెస్లో అయిదు తులాల బంగారు గొలుసులను అపహరించారు. దీంతో జిల్లా బంగారు దుకాణ యజమానుల సంఘం అప్రమత్తమై రాజాంలో వీరి మోసాలను గుర్తించి పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. రాజాం పోలీసులు వీరిని నరసన్నపేట పోలీసులకు అప్పగించడంతో ప్రస్తుతం లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.