TIFFIN | ఈరోజుల్లో జనాలు డైట్ పేరుతో రాత్రి పూట భోజనం చెయ్యడం స్కిప్ చేస్తున్నారు.. దాంతో అందరు టిఫిన్స్, లేదా ఫ్రూట్స్ తింటున్నారు.. ఎక్కువమంది దోస, ఇడ్లీ వంటివాటిని తింటుంటారు.. వాటిని నైట్ తింటే చాలా ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..ఇడ్లీ, దోశలను పులియబెట్టిన పిండితో చేస్తారు. అయితే, పులియబెట్టిన ఫుడ్స్ జీర్ణశక్తికి మంచివే. మరి వీటిని రాత్రి తీసుకోవడం మంచిదేనా తెలుసుకోండి.
గర్భిణీలు, పాలిచ్చేవారు కూడా రాత్రుళ్ళు పులియబెట్టిన ఆహారాన్ని తీసుకోకూడదు. గర్బధారణ సమయంలో కడుపు అసౌకర్యంగా ఉంటుంది. పెరుగు, పనీర్ వంటి వాటికి దూరంగా ఉండాలి. అదే విధంగా, పాలిచ్చే తల్లులు దూరంగా ఉండాలి. ఎందుకంటే, తల్లికి కడుపునొప్పికి వస్తే పిల్లలకి కూడా వస్తుంది.. కొన్నిసార్లు ప్రమాదాలు కూడా ఉంటాయని నిపుణులు వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు..
కొంతమందికి జీర్ణ సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా అసిడిటీ, కడుపు ఉబ్బరం ఉన్నవారు రాత్రుళ్ళు పులియబెట్టిన ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. దోశ, ఇడ్లీ, కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యల్ని కలిగిస్తాయి. కాబట్టి, జీర్ణ సమస్యలు ఉన్నవారు దోశ, ఇడ్లీలను తీసుకోవకపోవడమే మంచిది..
కొందరు ఫుడ్ అలర్జీలతో బాధపడతారు. అలాంటి వారు రాత్రి పూట వీటిని తీసుకోవకపమేవడమే మంచిది. అలాంటి వారు ఈ ఫుడ్స్ తీసుకుంటే అజీర్ణం, తలనొప్పి వంటి సమస్యలతో బాదపడతారు.. వీటిని నైట్ అస్సలు తీసుకోకండి..
పులియబెట్టిన ఫుడ్స్ జీర్ణశక్తిని పెంచి పేగు ఆరోగ్యాన్ని, జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తిని పెంచుతాయి. వీటి వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. వీటిలో ఎక్కువగా పీచు పదార్థాలు ఉంటాయి. అయితే, ఉదయాన్నే తీసుకోవడం మంచిదే. కానీ, రాత్రి తీసుకుంటే శరీరానికి తీవ్ర నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మిత్రమా జాగ్రత్త..