POLICE | భూవివాదం కేసులో పోలీసులకి దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న రామ్‌శరణ్ అనే నకిలీ సాధువును పోలీసులు సినిమా స్టయిల్లో అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని మొరెనాకు చెందిన రామ్‌శరణ్ ఓ కేసులో రెండేళ్లుగా పరారీలో ఉన్నాడు. ఈ కేసు ఇటీవల హైకోర్టు ముందుకు వచ్చింది.
ఈ నేపథ్యంలో పోలీసులు రామ్ శరణ్ గురించి ఆరా తీయగా.. అతడు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం మథురలోని రామ్‌జానకి ఆలయ ఆశ్రమంలో సాధువుగా చలామణి అవుతున్నట్లు తెలిసింది. దాంతో అక్కడకు వెళ్లిన పోలీసులు.. తమకి చూసి అతను పరార్ అయ్యే అవకాశం ఉండటంతో సాధారణ దుస్తులు ధరించి ఆశ్రమంలో ప్రవేశించారు.
రామ్ శరణ్ కనిపించగానే అతడి చేతుల్లో పండ్లు పెట్టారు. ఓ కానిస్టేబుల్ వినమ్రంగా పాదాలు తాకి నమస్కారం చేశారు. ఆ తరవాత మిమ్మల్ని అరెస్టు చేయడానికి వచ్చామని చెప్పడంతో ఆ నకిలీ సాధువు అవాక్కయ్యాడు. ఇక చేసేదేమీ లేక.. పోలీసుల వెంట నడిచారు. దాంతో అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాక.. ఆశ్రమంలోని భక్తులు ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు.