BOBBILI | పట్టాల పక్కనుంచి నడిచి వెళుతున్న ఓ వ్యక్తి రైలు వేగానికి ఎగిరిపడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటన బొబ్బిలి మండలంలో జరిగింది. ఎస్సై సత్యనారాయణ వివరాల ప్రకారం.. పెంట గ్రామానికి చెందిన 40 ఏళ్ల గుల్ల తిరుపతి సమీపంలో ఉన్న పట్టాల పక్క నుంచి పొలానికి నడుచుకుంటూ వెళుతున్నాడు.
అదే సమయంలో పట్టాలపై రైలు వచ్చింది. ఆ వేగానికి తుళ్లిపడి తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. వాస్తవానికి రైలు వేగానికి కొన్ని మీటర్ల వరకూ ఆ ఫోర్స్ ఉంటుంది. ఆ విషయం తెలియక.. రైలుకి సమీపంలో నడవడం, ఫొటోలు తీసుకోవడం చేస్తుంటారు. అది చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రన్నింగ్ ట్రైన్ నుంచి దిగే సమయంలోనూ ఆ వేగాన్ని మ్యాచ్ చేయగలిగేలా దిగాలి తప్ప.. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పట్టుజారి ప్లాట్‌ఫామ్‌పై పడిపోయే ప్రమాదం ఉంది.