PARVATHIPURAM | దత్తిరాజేరు మండలంలోని షికారుగంజి కూడలి వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో అయిదుగురికి గాయాలయ్యాయి. బాధితుల వివరాల ప్రకారం.. స్థానిక జాతీయ రహదారిపై ఆగి ఉన్న బస్సును అదే మార్గంలో విశాఖ నుంచి పార్వతీపురం వెళుతున్న మరో వాహనం ఢీ కొంది.
ఈ ఘటనలో ముందు బస్సు పక్కనున్న పొలంలోకి వెళ్లిపోయింది. దీంతో అందులో ఉన్న చోదకుడు, కండక్టరుతో పాటు ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో గజపతినగరం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి విజయనగరం తరలించారు. ఈ ప్రమాదం గురించి ఎస్.బూర్జవలస ఎస్సై రాజేష్ వద్ద ప్రస్తావించగా ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు