SUICIDE | కుమార్తె పుట్టింటికి రావటం లేదని మనస్తాపంతో తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరులో చోటు చేసుకుంది. ఎస్సై కె.రామారావు కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం చింతపల్లికి చెందిన వేములమంద కాశీవిశ్వనాథరాజు తన కుమార్తె విద్యాకవితను ఉండ్రాజవరం మండలం వడ్లూరుకు చెందిన దండు వెంకటబంగార్రాజుకు ఇచ్చి వివాహం చేశారు.
వీరికి కుమార్తె ఉన్నారు. ఏడాదిన్నర కాలంగా పుట్టింటికి రమ్మని తండ్రి పలుమార్లు కోరినా కుమార్తె వెళ్లలేదు. ఈ నెల 8న వడ్లూరులోని కుమార్తె ఇంటికి వెళ్లగా కనీసం ఆమె గేటు కూడా తీయలేదు. దీంతో మనస్తాపం చెందిన కాశీవిశ్వనాథరాజు గ్రామానికి సమీంపలోని కొబ్బరి తోటల్లో పురుగు మందు తాగారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ని కుటుంబ సభ్యులు తణుకు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు