UTTAR PRADESH | తప్పు చేసి దొరికిపోయిన అక్క.. తప్పించుకునేందుకు సొంత చెల్లెలను హతమార్చిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బల్రాయ్ పోలీస్‌స్టేషను పరిధిలో చోటు చేసుకుంది. ఓ యువతి తన ప్రియుడితో సన్నిహితంగా ఉండగా చూశారని సొంత చెల్లెళ్లనే హతమార్చింది.
బహదూర్పుర్ గ్రామానికి చెందిన 20ఏళ్ల అంజలి.. తల్లిదండ్రులు లేని సమయంలో ప్రియుణ్ని ఇంటికి పిలిచింది. అతడితో ఆమె సన్నిహితంగా ఉండగా.. ఆరు, నాలుగేళ్ల వయసున్న చెల్లెళ్లు చూశారు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబుతారేమోనని భయపడిన అంజలి చిన్నపిల్లలని కూడా చూడకుండా పదునైన ఆయుధంతో చెల్లెళ్లను హత్య చేసింది. చెల్లెళ్లను ఎవరో చంపేశారని తల్లిదండ్రుల ముందు కట్టుకథ సృష్టించింది.
ఘటనా స్థలంలో రక్తపు మరకలతో ఉన్న అంజలి దుస్తులను గుర్తించిన పోలీసులు ఆమెను నిలదీశారు. అసలు విషయం వెలుగులోకి రావడంతో నిందితురాలిని అరెస్టు చేశారు.