LIFESTYLE | మగవాళ్లు పైకి గంభీరంగా కనిపించినా లోపల మనసు వెన్న.. అయితే వారిని అర్థం చేసుకోవడమే కష్టం.. పెళ్లికి ముందు ఒకలా పెళ్లి తర్వాత మరొకలా ఉంటారు.. వారిని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు.
మీ భర్త నవ్వడం మీరు చూడలేరు. అతను ఏడవడం చూడలేరు. చాలా ఇళ్లలో భర్త పనిచేస్తేనే ఆ ఇల్లు గడుస్తుంది..చక్రం ఆగిపోతే ఆ కుటుంబం సంతోషంగా ఉండలేదు. అందుకే అతనికి స్వేచ్ఛను ఇస్తే భార్యలపై అమితమైనా ప్రేమను కురిపిస్తారు.
భర్త మనసులో ఏముందో కనుక్కోవడం అంత సులువు కాదు. కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం కలలను చంపి పాతిపెట్టే భర్తలు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు చూసినా ఇంట్లో నెగెటివ్ గా మాట్లాడకండి. అది లేదు, ఇది లేదు అని విసిగించక.. ఆఫీస్ నుంచి ఇంట్లోకి రాగానే చిన్నగా చిరునవ్వుతో పలకరించి కూర్చోబెట్టండి.
మీ భర్త సెలవులో ఉన్నప్పుడు బల్లిలా అతుక్కుపోండి. అవసరమైనప్పుడు ముద్దుల బహుమతి ఇవ్వండి. అతన్ని మీ నుండి దూరంగా వెళ్లనివ్వవద్దు. ఇది మీరు అతని కోసం కేటాయించిన రోజు అని అతనికి అర్థం అయ్యేలా చెప్పండి. మీ భర్తపై మీకున్న నమ్మకమే తను చేయలేని పనులు చేసేలా చేస్తుంది. మీరు అతనిపై విశ్వాసం కోల్పోతే.. మీరు వాటిని కోల్పోతారు.
మీ భర్త ధరించే బట్టలు, అతని ఆస్తులు లేదా అతని నిర్ణయాలు మీ పట్ల అతని ప్రేమను నిర్ణయించవు. కాబట్టి అతనిని ఆయనలాగే ప్రేమించండి. అన్ని సమయాల్లో మీ కోసం పని చేస్తున్నందుకు కొంచెం ప్రశంసించండి.. అతనికి ఎక్కడాలేని ఆనందంతో పొంగి పోతాడు..ఇలాంటి చిన్న చిన్నవి చేస్తే చేస్తే మీ భర్త మీ ప్రేమలో మునిగి తేలిపోతాడు.