EGGS | మన దైనిందిక జీవితంలో రోజుకు ఒక గుడ్డు తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని నిపుణులు చెప్తుంటారు. గుడ్డులో మంచి పోషక విలువలు, ప్రోటీన్స్ ఉంటాయి.. పిల్లలు, పెద్దలు ఎక్కువగా తింటారు. కాబట్టి, ఎక్కువగా ఇంటికి తీసుకొస్తుంటారు. అయితే ఆ గుడ్లను ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే చెడిపోతాయి.. అలా పాడవ్వకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే మాత్రం టిప్స్‌ను ఫాలో అవ్వాల్సిందే.
సాల్మెనెల్లా బ్యాక్టీరియా గుడ్ల షెల్, లోపల ఉంటుంది. ఈ బ్యాక్టీరియా పెరుగుదల గది ఉష్ణోగ్రత కంటే చల్లగా ఉంటుంది. ఫ్రిజ్‌లో పెడితే బ్యాక్టీరియా గుడ్డుపైనే కాకుండా మిగతా పదార్థాలపై కూడా వ్యాపిస్తుంది.. అందుకే వీటిని ఎట్టి పరిస్థితులలో ఫ్రిజ్‌లో పెట్టకూడదు
కోడి గుడ్డు ఎక్కువకాలం తాజాగా ఉండాలంటే వాటిని ఎక్కువగా కదపడకూడదు. వెడల్పుగా ఉండే భాగాన్ని పైకి వచ్చేలా ఉంచాలి.. ఇలా చేస్తే ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి. ఇక గుడ్డు పైన పెంకుపై కొద్దిగా ఆయిల్ రాసి పెడితే గుడ్లు కనీసం 10 నుండి 12 రోజుల వరకూ తాజాగా ఉంటాయి. ఇలా చేస్తే పాడవ్వకుండా ఎక్కువరోజులు ఫ్రెష్ గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
గుడ్డు ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉండాలంటే ఒక్కో గుడ్డుని టిష్యూ పేపర్స్‌తో చుట్టి స్టోర్ చేయండి. దీని వల్ల ఈ గుడ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. ఇలాంటి కొన్ని టిప్స్ పాటిస్తే గుడ్లు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా తాజాగా ఉంటాయి.