HAIR OIL | మన అందాన్ని రెట్టింపు చేసే జుట్టు ఒత్తుగా, పొడుగ్గా ఉండాలని అనుకోని వారుండరు. అందుకోసం రకరకాల హెయిర్ స్టైల్స్‌ని ట్రై చేస్తుంటారు. కేశ సంరక్షణలో భాగంగా జుట్టుకు నూనె రాసుకోవడం ఒకటి. జుట్టుకు నూనె రాసుకోవడం చాలా మంచిది. దీని వల్ల జుట్టు సాఫ్ట్ గా, షైనీగా, తేమగా, తెల్ల బడకుండా ఉంటుంది. అందులోనూ జుట్టుకు కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల మరిన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ఉండే పోషకాలు జుట్టును మరింత అందంగా కనిపించేలా చేస్తాయి. జుట్టు రాలకుండా, బలంగా ఉంటుంది. హెయిర్ రాలకుండా ఉంటుంది. అలాగే మెత్తగా, మెరుస్తూ ఉంటుంది. అయితే మీరు జుట్టుకు రాసుకునే ముందు మంచి కొబ్బరి నూనెను ఎంచుకోవాలి.
చాలా మంది తలకు నూనె రాసుకునే సమయంలో అనేక తప్పులను చేస్తూంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండటం కాక.. మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. నూనెను తలకు రాసుకుని రోజుల తరబడి అలానే ఉంచేస్తారు. ఒకటి, రెండు రోజులు ఫర్వాలేదు కానీ.. వారం రోజులు అలా ఉంచితే.. తలపై ఫంగల్ ఇన్ ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. దీని వల్ల చుండ్రు, జుట్టు నిర్జీవంగా, బలహీనంగా తయారవుతుంది.
చాలా మంది రాత్రి పడుకునే ముందు నూనెను రాసుకుంటారు. ఇలా చేయడం వల్ల తలపై ఫంగల్ ఇన్ ఫెక్షన్స్ పెరుగుతాయి. ఆ నూనె అంతా దిండుకు అంటుకుని ముఖంపై పింపుల్స్, నల్లటి మచ్చలు వచ్చేలా చేస్తాయి. దీంతో ముఖం కూడా పాడవుతుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు నూనె రాసుకోకూడదు.
నూనె రాసుకునేటప్పుడు చాలా మంది గట్టిగా రుద్దుతారు. ఇలా చేయడం వల్ల జుట్టు దెబ్బతింటుంది. మృదుత్వాన్ని కోల్పోయి.. రఫ్ గా మారుతుంది. దీంతో జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది. కాబట్టి జుట్టుకు నూనె రాసుకుంటే.. సున్నితంగా రాసుకోవాలి. మరి కొంత మంది జట్టుకు ఆయిల్ రాసేటప్పుడు మర్దనా చేసుకుంటూ ఉంటారు. గట్టిగా రుద్దుకుంటూ చేస్తారు. ఇలా అస్సలు చేయకూదు. మెల్లగా వేళ్లతో మర్దనా చేసుకోవాలి. ఇలా చేస్తే తలపై బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది. అలాగే రిలాక్స్ గా ఉంటుంది.