HEALTH BENEFITS | ఇంట్లో టిఫిన్‌కి ఉప్మా అంటే చాలా మందికి ఇష్టం ఉండదు.. కానీ ఇది డైట్ ఫుడ్.. బ్రేక్ ఫాస్ట్ లలో చాలా సులువుగా చేసుకొనే టిఫిన్ లలో ఉప్మా ఒకటి.. చాలా తక్కువ సమయంలో దీనిని తయారు చేయవచ్చు. అయితే చాలా మందికి ఉప్మా అస్సలు నచ్చదనే చెప్పవచ్చు.
ఉదయం పూట అల్పాహారం తీసుకోకుండా అయిన ఉంటారు కానీ ఇంట్లో తయారు చేసే ఉప్మాను మాత్రం తినరు. అలాగే మనకు హోటల్స్ లో, రోడ్ల పక్కన బండ్ల మీద అనేక రకాల టిఫిన్స్ దొరుకుతాయి కానీ ఉప్మా మాత్రం దొరకదు.. అక్కడ తినడానికి ఇష్టపడరు.
ఈ ఉప్మాను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. గుండె మరియు మూత్రపిండాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే ఉప్మాలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తక్కువ నూనెతో తయారు చేస్తారు కనుక ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది. ఈ ఉప్మా పోపులో పల్లీలు, శనగపప్పు, పెసరపప్పు వంటి వాటిని వేసి తయారు చేస్తారు. కనుక ఉప్మాను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మరింతగా మేలు కలుగుతుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, జలుబు, జ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉప్మాను తయారు చేసుకుంటారు.. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే.. క్యారెట్, బీన్స్, బఠాణీ, టమాట వంటి కూరగాయ ముక్కలు, సుగంధ ద్రవ్యాలు, జీడిపప్పు వంటి వాటిని కూడా వేస్తాము. కాబట్టి ఉప్మాను తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే పోషకాలు కూడా లభిస్తాయి. అలాగే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అలాగే బరువు తగ్గడంలో కూడా ఉప్మా మనకు దోహదపడుతుంది.