WALKING| ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం చాలా మంచిది. వాకింగ్ చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల రిస్కు తగ్గుతుంది. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. రోజూ వాకింగ్ చేయడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. టైప్ 2 డయాబెటిస్, ఆస్తమా, కొన్ని రకాల కేన్సర్ ను తగ్గిస్తుంది. అంతేకాకుండా ప్రతీ రోజూ వాకింగ్ చేయడం వల్ల ఎముకలు గట్టిపడతాయి.
కండరాలకు బలం చేకూరుతుంది. బరువు తగ్గడానికి చాలా సులువైన మార్గం నడవడం. అయితే మీరు వాకింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేదంటే.. కొన్ని అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. వాకింగ్ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం.
నడుస్తున్నప్పుడు చేతులు ఊపకుండా ఉండడం చాలా మందికి అలవాటు. దీని వల్ల వారికి నడక వల్ల పూర్తి ప్రయోజనం లభించదు. నడుస్తున్నప్పుడు చేతులు ఊపడం మంచిది. ఇది నడక సామర్థ్యాన్ని మెరుగుపరిచి శరీర సమతుల్యతను కాపాడుతుంది.
నడవడానికి సరైన పాదరక్షలు కూడా ముఖ్యం. మీరు సరైన పాదరక్షలు ధరించి నడవకపోతే అది సమస్యలను పెంచుతుంది. దీని వల్ల కడుపు సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. పాదాలపై బొబ్బలు వచ్చే అవకాశం ఉంటుంది.
నడిచేటప్పుడు శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. దానివల్ల అలసట, బలహీనతని కలిగించదు. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచకపోవడం వల్ల కండరాలు అలసట, తిమ్మిర్లు వస్తాయి. కాబట్టి రోజంతా తగిన మోతాదులో నీరు తాగాలి. నడిచేటప్పుడు కొంతమంది కిందకి చూస్తారు. కొందరు మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ ఉంటారు. అలా కిందకు చూడటం వల్ల వెన్ను, శరీర నొప్పిని కలిగిస్తుంది