CYCLING BENEFITS | మారుతున్న ఆహార అలవాట్ల కారణంగా చాలామందికి పొట్ట ఉండటం సహజం. కానీ.. దీన్ని షేమ్ గా ఫీలవుతున్నారు. పదిమందిలో పొట్టను పెట్టుకుని తిరగడమంటే ఏదో ఇబ్బంది పడతారు. అయితే ఆ పొట్టన కరిగించడానికి స్లిమ్ కావడం కోసమని తెగ తాపత్రయ పడుతూ ఉంటారు. దానికోసం పడరాని పాట్లు పడుతూ ఉంటారు.
తిండి కూడా సరిగ్గా తినకుండా కడుపుని ఎండ కట్టుకుంటూ, జిమ్స్ చుట్టూ ఏరోబిక్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే అటువంటి వారు స్లిమ్ కావడం కోసం సమయం, డబ్బులు వృధా చేయాల్సిన అవసరమే లేదు. కేవలం ఒక అరగంట సైకిల్ తొక్కితే ఆరోగ్యంగాను, స్లిమ్ గానూ ఉంటారు.
సైకిల్ తొక్కడానికి చిన్న పెద్ద తేడా అనేది లేదు. ఎవరైనా సైకిల్ తొక్కవచ్చు. శారీరక, మానసిక అనారోగ్యంతో బాధపడే వారు తప్ప.. మిగతా వారు సైకిల్ ను రెగ్యులర్ గా తొక్కవచ్చు.
వయసు, శక్తిని బట్టి ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఒక్క అరగంట పాటు సైకిల్ తొక్కితే ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. సైక్లింగ్ గుండె, శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. జీర్ణ వ్యవస్థను సక్రమంగా పని చేస్తుంది. సైక్లింగ్ తో శరీరంలోని రక్తప్రసరణను మెరుగుపరిచి శరీర భాగాలకు సరైన ఆక్సిజన్, పోషకాలను అందించడంలో సహాయపడుతుంది