DREAMS | సాధారణంగా అందరికీ నిద్రలో కలలు వస్తూ ఉంటాయి. కొందరికి హ్యాపీగా ఉన్న కలలు వస్తే.. మరి కొందరికి పీడ కలలు వస్తూంటాయి. ఈ పీడ కలలతో భయపడిపోతూ ఉంటారు. నిద్ర పోవడానికి బెదిరిపోతారు. కొంత మంది కలలో వచ్చిన పీడ కలలతో నిద్రలోనే కేకలు, అరుస్తూ ఉంటారు. అయితే తెల్లవారగానే అంతా మామూలుగా ఉంటారు.
నిద్రలో పీడ కలలు రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇవి అంతర్లీనంగా పలు సమస్యలకు దారి తీస్తుంది. ఎవరికైతే పీడ కలలు వస్తాయో వారికి మతి మరుపు అనేది పెరుగిపోతూ ఉంటుంది. చిన్న వయసులోనే మతి మరుపు రావడం చాలా విషయాలు మర్చిపోయే అవకాశాలు లేక పోలేదు. ఇలా చిన్న విషయాలను మార్చిపోవడాన్ని డిమోన్షియా అని అంటారు.
ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు పలు పరిశోధనలు చేశారు. దాదాపు 24 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిపై ఈ రీసెర్చ్ లు చేశారు. దాదాపు 2,600 మందిపై జరిగిన పరిశోధనలపై పలు విషయాలను వెల్లడించారు నిపుణులు. సాధారణ మనుషులతో పోలిస్తే పీడ కలలు వచ్చే వారిలో త్వరగా మతి మరుపు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పీడ కలలు వచ్చే వారు డిమోన్షియా బారిన పడతారని తేల్చారు.
పీడ కలలు వచ్చే వారు.. తప్పనిసరిగా మానసిక వైద్యులను ఖచ్చితంగా సంప్రదించాలి. పీడ కలలు రావడం వల్ల మాత్రం చాలా ప్రమాదకరమైన విషయం అని నిపుణులు సూచిస్తున్నారు. సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తే ముందు నిద్ర మీద ధ్యాస పెట్టాలి