RAJAMAHENDRAVARAM | తప్పు చేసి.. జైలు శిక్ష ముగించుకుని బయటకు వచ్చిన ఓ నిందితుడు, తిరిగి నేరాలకు పాల్పడిన వైనమిది. కావలి పట్టణంలోని ట్రంకురోడ్డులో ఉన్న కారుకేర్లో ఓ పాత కారు చోరీకి గురైనట్లుగా యజమాని గంగినేని వెంకటేశ్వర్లునాయుడు పోలీసులను ఆశ్రయించారు. తమ కారుకేర్కి తాళాలు వేసి ఉండగా, ఇలా జరిగినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కారు కేర్లో మొత్తం ఐదు కార్లుండగా, ఒకటి అపహరణకు గురైంది. ఈ మేరకు కావలి రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే, పోలీసుల ప్రాథమిక విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సీసీ కెమెరాల ద్వారా నిందితుడి ఆనవాళ్లను గుర్తించి విచారణ కొనసాగిస్తున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన అతను గతంలో వివిధ నేరాలకు పాల్పడి, ఒంగోలు జైలులో శిక్ష అనుభవించాడు. విడుదలైన గంటల వ్యవధిలో కావలిలో దొంగతనానికి పాల్పడ్డాడు