LLICIT RELATIONSHIP | అక్రమ సంబంధాలన్నీ విషాదంతోనే ముగుస్తాయని మరోసారి నిరూపితమైంది. సభ్య సమాజం తలదించుకునేలా ఒక వ్యక్తి తన కూతురి అత్తగారితో లవ్లో పడ్డాడు. ఇద్దరూ కూడా ఇంట్లో నుంచి పారిపోయారు. చివరకు ఈ సంబంధాన్ని బంధువులు వ్యతిరేకించడంతో అవమానం తట్టుకోలేక తనువు చాలించారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని లఖింపూర్కి చెందిన 44 ఏళ్ల రామ్ నివాస్ రాథోడ్ భార్య చనిపోయింది. అతనికి ఒక కుమార్తె ఉంది. తన కూతురిని ఆశారాణి అనే మహిళ కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుని మేలో నిర్ణయానికి వచ్చారు. ఆశారాణికి అప్పటికే ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆశారాణి కొడుకుతో తన కుమార్తె వివాహం ఫిక్స్ కావడంతో రామ్ నివాస్ తరుచుగా ఆమె ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలోనే ఆశారాణితో ప్రేమలో పడ్డాడు.
సెప్టెంబర్ 23న రామ్ నివాస్, ఆశారాణి ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు. దీంతో మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి పోలీసులు వీరిద్దరి కోసం వెతుకుతున్నారు. ఈ వ్యవహారంతో ఇద్దరు తరఫున బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు బంధువుల నుంచి వ్యతిరేకత.. మరోవైపు పోలీసులు వెతుకుతుండటంతో ఇద్దరు మనస్తాపంతో తమ ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రేమను వదులుకోలేక ఇద్దరూ ప్యాసింజర్ రైలు కింద పడి చనిపోయారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.