AMARAVATHI | టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన సీఐడీ అధికారుల మొబైల్ CALL DATA రికార్డు పిటిషన్పై విచారణను ఏసీబీ కోర్టు ఈ నెల 27కి వాయిదా వేసింది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గత సెప్టెంబర్ 9న ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ అధికారుల మొబైల్ కాల్ డేటా ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈ ఏడాది సెప్టెంబర్ 11న ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను సవరించి వేయాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సూచించారు. దీంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈ పిటిషన్ను సవరించి దాఖలు చేశారు. ఈ నెల 18న ఈ పిటిషన్పై విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఏపీ ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున ఈ పిటిషన్పై విచారణను ఈ నెల 20కి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.
ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీ తరపు న్యాయవాదిని ఏసీబీ కోర్టు ఈ నెల 20న ఆదేశించింది. అయితే తమకు సమయం కావాలని సీఐడీ తరపు న్యాయవాది ఏసీబీ కోర్టును కోరారు. దీంతో ఈ నెల 26 వరకు ఈ పిటిషన్పై విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఏపీ సీఐడీ తరపు న్యాయవాదులు ఈ కేసులో కౌంటర్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టుగా ఏసీబీ కోర్టు తెలిపింది