ASHOK GAJAPATHIRAJU | నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్రకు సంఫీుభావం
టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.అశోక్ గజపతిరాజు పార్టీ అధినేత చంద్రబాబుకు సంఫీుభావం ప్రకటించారు. చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ పరామర్శ యాత్రకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన 72 ఏళ్ల వయసులో, టీడీపీ గుర్తు అయిన సైకిల్ తొక్కుతూ పార్టీ పట్ల తన విధేయత చాటారు. ఇందుకు సంబంధించిన వీడియోను టీడీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తన వైఖరిని తెలియజేసేందుకు ఈ వయసులోనూ సైకిల్ తొక్కిన అశోక్‌గజపతిరాజును చూసిన పలువురు ఆయనకు పార్టీ పట్ల ఉన్న విధేయతకు ముగ్ధులవుతున్నారు. ఈ సమయంలో ఇలాంటివి పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తి నింపుతాయని పలువురు టీడీపీ అభిమానులు అంటున్నారు.