WIFE KILLED HUSBAND | వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే కడతేర్చాలని చూసింది ఓ WIFE అనుకున్న ప్రకారం ప్రియుడితో కలిసి అడ్డు తొలగించింది. మండలంలోని వేగివాడ గ్రామానికి చెందిన నల్లిమెల్లి రమేష్, రిబ్కాలకు 13 సంవత్సరాల కిందట వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతుంటారు. పనులకెళ్లి తిరిగి వచ్చేటప్పుడు పెదవేగి మండలం కె.కన్నాపురానికి చెందిన ఆటో డ్రైవర్ కమ్మిలి శ్రీనివాసరావు అలియాస్ శ్రీనుతో రిబ్కాకు పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధంగా మారింది.
ఈ విషయం తెలిసి రిబ్కాను భర్త రమేష్ మందలించాడు. ఈ క్రమంలో నాలుగేళ్ల కిందట రిబ్కా పుట్టింటికి వెళ్లిపోయి వివాహేతర సంబంధం కొనసాగించింది. ఇదిలా ఉండగా రిబ్కాను, HUSBAND రమేష్‌ను కలపాలని.. లేదంటే పిల్లలు అన్యాయమైపోతారని భావించిన పెద్దలు ఆమెకు నచ్చజెప్పి ఈ నెల 15న కాపురానికి పంపారు. ఈ క్రమంలో ‘నిన్ను నమ్ముకుని ఉండిపోయా.. పెళ్లి కూడా చేసుకోలేదు. నువ్వు ఇలా వచ్చేస్తే నా పరిస్థితి ఏమిటి’ అంటూ ప్రియుడు శ్రీను రిబ్కా వద్దకు వచ్చి అడగడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది.
శ్రీను మోజులో ఉన్న రిబ్కా ఆలోచనలో పడింది. నీ భర్త రమేష్ అడ్డు తొలగించుకుంటే ఇద్దరం కలిసి ఉండొచ్చని శ్రీను చెప్పడం ఆమె అంగీకరించింది. దీంతో రమేష్‌ను చంపేందుకు పథకం రచించారు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల 24న రాత్రి శ్రీను కత్తి తీసుకుని వేగివాడకు వచ్చాడు. నేరుగా రిబ్కా ఇంటికొచ్చి ఆమెను సంప్రదించాడు. నిద్రపోతున్న రమేష్‌ను బయటకు పిలిచి శ్రీను తన వద్దనున్న కత్తితో విచక్షణా రహితంగా నరికాడు. రిబ్కా కూడా సహకరించింది. అనంతరం శ్రీను పరారయ్యాడు.
రక్తపు మడుగులో ఉన్న రమేష్‌ను స్థానికులు తొలుత ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పెదవేగి పోలీసులు జంగారెడ్డిగూడెం మార్గంలోని కొప్పులవారిగూడెం 7వ మైలు రాయి వద్ద శ్రీను, రిబ్కాలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, ద్విచక్ర వాహనం, చరవాణిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.