BAPATLA | బాపట్లలో విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు దారి తప్పి ఐదో తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు పట్టణంలోని మల్లికార్జున బృందావనం కాలనీ పురపాలక ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు పి.రామచంద్రరావు ఎక్కాలు చెబుతానంటూ బాలికను ఒంటరిగా గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
బాధిత విద్యార్థిని ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు జరిగిన ఘటన తెలియజేసి విలపించింది. వారు పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడిని నిలదీశారు. ఆ వెంటనే పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ వెంకటేశులు, పట్టణ సీఐ శ్రీనివాసులు.. బాధితురాలు, కుటుంబసభ్యులను విచారించి వివరాలు నమోదు చేశారు. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు