BJP LEADERSHIP PROBLEM | తెలంగాణలో ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఎంపిక ఎంతకీ ఓ కొలిక్కిరావడం లేదు. మొదటి జాబితాలో తమ పేరు ఉంటుందని ఆశీంచిన నేతలకు చుక్కెదురు కావడంతో ఆలకపాన్పు ఎక్కారు. సీటుపై గంపేడు ఆశలు పెట్టుకున్న రంగారెడ్డి రూరల్, మేడ్చల్ ఆర్బన్ పార్టీ అధ్యక్షులు సైతం పార్టీ పెద్దల వ్యవహర తీరుపై గుర్రుగా ఉన్నారు.
మొదటి జాబితాలో మహేశ్వరం నుంచి శ్రీరాములు యాదవ్, ఇబ్రహింపట్నం నుంచి దయానంద్ గౌడ్, కల్వకుర్తి నుంచి ఆచారీ, కుత్బుల్లాపూర్ నుంచి కూన శ్రీశైలం గౌడ్లను అభ్యర్దులుగా ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలోని ఎల్.బి.నగర్, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్‌నగర్, శేరిలింగంపల్లి, వికారాబాద్, పరిగి, తాండూర్, కొడంగల్, మేడ్చల్, కూకట్పల్లి, ఉప్పల్, మల్కాజ్గిరి నియోజకవర్గాలకు అభ్యర్దుల ఎంపికలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. కీలకమైన ఈ స్థానాల్లో జాప్యంపై స్థానిక నేతలు మండిపడుతున్నారు.
ఎల్.బి.నగర్ టికెట్ కోసం రంగారెడ్డి జిల్లా అర్బన్ పార్టీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి చాలా ఆశలు పెట్టుకున్నారు. రంగారెడ్డి తో పాటు మధుసూదన్ రెడ్డి తదితరులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రాజేంద్రనగర్ టికెట్ కోసం కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు అంజన్‌కుమార్ గౌడ్, బుక్క గోపాల్, నరేందర్ రెడ్డి, మల్లారెడ్డి,శ్రీదర్,బాల్ రెడ్డి తదితరులు దరఖాస్తు చేసుకుని తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎవరికి టికెట్ వచ్చిన మరోనేత సహకరించే సీన్ లేదు. వికారాబాద్, పరిగి, తాండూర్, కొడంగల్ నియోజకవర్గాల్లో పోటి చేయడానికి చాలా మంది నేతలు దరఖాస్తులు సమర్పించిన బరిలో నిలిచినా.. ఇతర పార్టీలకు కనీస పోటీ ఇవ్వగల సత్తా ఉన్న నాయకులు మాత్రం లేకపోవడంతో వేచిచూసే దోరణిలో బీజేపీ పెద్దలు అవలంబిస్తున్నారు. మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి తట్టుకునే నేత లేకపోవడంతో బలమైన అభ్యర్థి కోసం ఇంకా వెతుకుతున్నారు.