ANANTHAPUR | ఆంధ్రప్రదేశ్లో కొంత మంది గ్రామ వాలంటీర్లు చేస్తున్న దారుణాలు ప్రజల్ని భయాందోళనకి గురి చేస్తున్నాయి. ANANTHAPUR జిల్లాలో ఓ వివాహితను 20 రోజులు బంధించిన వాలంటీర్ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
వివాహిత పోలీస్స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. యాడికి మండలంలో ఓ గ్రామానికి చెందిన వివాహిత మండల కేంద్రంలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. అదే మండలం కోన ఉప్పలపాడు గ్రామానికి చెందిన దాసరి సతీశ్ గ్రామ వాలంటీరుగా పనిచేస్తున్నాడు.
సతీష్ గత 3 నెలలుగా వివాహిత ఇంటికి తరచూ వెళుతూ పరిచయం పెంచుకున్నాడు. ఈ నెల 7న వివాహిత తన ఆరేళ్ల కూతురితో దుకాణంలో ఉండగా సతీశ్ అక్కడికి కారులో వెళ్లాడు. ఆమెను బయటకు పిలిచి తన కోరిక తీర్చాలని లేదంటే భర్త, పిల్లలను చంపేస్తానని బెదిరించాడు. బలవంతంగా వివాహితను, చిన్నారిని కారులో ఎక్కించుకుని స్థానికంగా ఉన్న తన గదికి తీసుకెళ్లాడు. ఆమెపై రెండు రోజులపాటు అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఈ నెల 9న తిరుపతికి తీసుకెళ్లి.. అక్కడ అద్దె గదిలో ఉంచి బాధితురాలి కుమార్తె ఎదుటే పలుమార్లు శారీరకంగా అనుభవించాడు.
గది నుంచి బయట పడదామనుకున్నా అవకాశం లేకుండా తాళం వేసుకుని వెళ్లేవాడు. నాలుగు రోజులుగా తల్లీ కూతుళ్లు కనబడక పోవడంతో ఆమె కుటుంబసభ్యులు ఈ నెల 11న యాడికి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు తిరుపతి పోలీసుల సహకారంతో వివాహితను ఈ నెల 25న వాలంటీరు చెర నుంచి విడిపించారు.