CONGRESS | తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకీ మారిపోతున్నాయి. నామినేషన్స్ గడువు సమీపిస్తుండటంతో వలసవాదులు కూడా పెరిగిపోతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వరుసగా అభ్యర్థుల జాబితాని ప్రకటిస్తుండటంతో.. అవకాశం దక్కని వారు పార్టీలు మారిపోతూ షాక్‌లు ఇస్తున్నారు. బీఆర్ఎస్ ఇప్పటికే 115 స్థానాలకి అభ్యర్థులని ఖరారు చేసేయగా.. కాంగ్రెస్ లిస్ట్ 100కి చేరింది. కానీ.. బీజేపీ మాత్రం ఇంకా 53 మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. దాంతో ఆశావహులు బీజేపీ వైపు చూస్తున్నారు. అయితే కాంగ్రెస్‌లో ఇటీవల చేరిన చాలా మంది నాయకులు పంతం నెగ్గించుకుంటూ సీట్లని దక్కించుకున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ మొదటి లిస్ట్‌లో వలసవాదులకి చోటివ్వలేదు. దాంతో రిస్క్ చేశామనే కంగారు వారిలో కనిపించింది. కానీ రెండో జాబితాలో 55 మందికి కాంగ్రెస్ చోటివ్వగా.. ఇందులో చాలా మంది ఇటీవల పార్టీలో చేరిన వారే ఉన్నారు. దాంతో మొదటి లిస్ట్‌లోని 45 మందిని కలుపుకుంటే కాంగ్రెస్ ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య వందకు చేరింది. ఇంకా 19 నియోజకవర్గాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించాల్సి ఉంది.
ఇటీవల మృతి చెందిన గద్దర్ని గౌరవిస్తూ అతని కుమార్తె జీవీ వెన్నెలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటుని కాంగ్రెస్ కేటాయించింది. అలానే ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి తదితరులకి సెకండ్ లిస్ట్‌లో కాంగ్రెస్ అవకాశం కల్పించింది.
కాంగ్రెస్‌లో ఇటీవల చేరిన అభ్యర్థులు.. వారికి కేటాయించిన సీట్లు ఇవే
మునుగోడు – కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
ఖమ్మం – తుమ్మల నాగేశ్వర్ రావు
పాలేరు – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
పాలకుర్తి – యశస్విని
వర్ధన్నపేట – కేఆర్ నాగరాజు
పినపాక – పాయం వెంకటేశ్వర్లు
ఆదిలాబాద్ – కంది శ్రీనివాస్ రెడ్డి
ఆసిఫాబాద్ – శ్యామ్ నాయక్
ముధోల్ – నారాయణ పటేల్
కూకట్ పల్లి – బండి రమేష్
శేరిలింగంపల్లి – జగదీష్ గౌడ్
తాండూరు – మనోహర్ రెడ్డి
మహబూబ్ నగర్ – యెన్నం శ్రీనివాస్ రెడ్డి