FASHION TIPS FOR WOMEN | సాధారణంగా అమ్మాయిలు కొత్త బట్టలు, నగలు మాత్రమే కాదు కొత్త చెప్పులను కూడా కొంటుంటారు.. డ్రెస్సులకు మ్యాచ్ అయ్యేలా కొంటారు.. అయితే కొత్త చెప్పులు వేసుకున్నప్పుడు అవి ఒక్కోసారి కరుస్తాయి.. అవి అలవాటయ్యే వరకు.. మన పాదాలకు రాసుకుంటాయి. దాంతో చిన్న గాయం లేదా దద్దుర్లు ఏర్పడతాయి. చెప్పులు కాళ్లను కరుస్తుంటే.. చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలానే సౌకర్యవంతంగా నడవలేం కూడా.
మనం కొత్త చెప్పులు వేసుకున్నప్పుడు.. కాళ్లకు డియోడరెంట్ లేదా హెయిర్ సీరమ్ అప్లై చేయండి. ఇలా చేస్తే.. పాదాలు, పాదరక్షలకు మధ్య రాపిడి తగ్గుతుంది. దీంతో మీరు సౌకర్యవంతంగా నడవచ్చు.. ఎటువంటి గాయాలు కావు. కొత్త చెప్పులు వేసుకునే ముందు పాదాలకు కొబ్బరి నూనె లేదా పెట్రోలియం జెల్లీ అప్లై చేసుకోండి. ఇలా చేస్తే చెప్పులు కాళ్లకు పట్టుకోవు.. గాయాలు అవ్వవు.
న్యూడ్ కలర్ సాక్స్‌లు వేసుకోండి. ఇలా చేస్తే.. చెప్పులు కాళ్లను కరవకుండా ఉంటాయి.FASHION TIPS FOR WOMEN |
చాలామంది ఎత్తు మడమల చెప్పులు వేసుకున్నప్పుడో, కాస్త వదులుగా ఉన్న చెప్పులూ, కొత్త బూట్లతో నడుస్తున్నప్పుడో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆ సమస్యల్ని తగ్గించుకోవాలంటే ‘హీల్ గ్రిప్స్, హై హీల్ ప్యాడ్స్ ఉంటాయి. ఇవి వేసుకుంటే.. సౌకర్యవంతంగా నడవచ్చు..
చెప్పులు కరిచిన చోట, బొబ్బలు ఏర్పడి చోట కలబంద గుజ్జు అప్లై చేయండి. కలబందలో యాంటీఇన్ల్పమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పి, మంటను తగ్గిస్తాయి. ఇక గాయాలు మంటగా ఉన్న చోట ఐస్ క్యూబ్ తో మసాజ్ చెయ్యడం మంచిది.. నొప్పి వెంటనే తగ్గుతుంది.. ఈ FASHION TIPS FOR WOMEN ఫాలో అయితే ఇక ఎటువంటి తిప్పలు ఉండవు.