NAILS | ఏ పని చేయాలన్నా.. సమయం, సందర్బం చూసుకోవాలని జ్యోతిష్య పండితులు చెప్తుంటారు. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే ఆర్థిక సమస్యలకు, మానసిక సమస్యలకు కారణం అవ్వవచ్చు. అటువంటి వాటిలో గోర్లు కత్తిరించడం కూడా ఒకటి.. గోర్లు కత్తిరించడం అనేది ఒక రోజు అనేది ఉంటుందని అప్పుడు మాత్రమే కత్తిరించాలని నిపుణులు అంటున్నారు.
గోర్లు కత్తిరించుకోవడానికి సోమవారం చాలా బాగుంటుందట. ఆ రోజు NAILS తీసేసుకుంటే శుభవార్తలు వింటారనీ పెద్దల నుంచి గుడ్ న్యూస్ వస్తుందని అంటున్నారు. అలాగే మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో గోళ్లు తియ్యవద్దు అంటున్నారు. ఆ రోజు గనక తీస్తే చాలా చిక్కులు తప్పవనీ, జీవితం సవాళ్ల మయంగా మారుతుందని అంటున్నారు. బుధవారం గోళ్లు తీసుకోవడానికి సరైన రోజు అని చెబుతున్నారు. ఆ రోజు గోళ్లు తీసేస్తే.. ప్రశాంతత కలుగుతుందనీ, మనస్శాంతి ఉంటుందట. గురువారం కొన్ని మంచి సంకేతాలు వచ్చే రోజు కావడం వల్ల ఆ రోజు గోళ్ల జోలికి వెళ్లకపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు..
ఇకపోతే శుక్రవారం అంటే లక్ష్మి దేవి వారం గోర్లను అస్సలు తియ్యకూడదు.. ఆ రోజు గనుక తీస్తే అనారోగ్యాలు రావడంతో పాటు శత్రువుల పీడలు తప్పవట. శనివారం గోళ్ల జోలికి అస్సలు వెళ్లవద్దు. ఒకవేల ఆ రోజు NAILS కత్తిరిస్తే దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే అంటున్నారు. అలా మొత్తంగా చూసుకుంటే గోర్లు కత్తిరించడానికి సోమవారం, బుధవారం మంచి రోజులు అని చెప్పవచ్చు. అలాగే గోర్లను కొరకడం అన్నది కూడా మంచి అలవాటు కాదు.. టైం దొరికినప్పుడు అంటే తప్పు.. ఒకసమయం, సందర్భంలో మాత్రమే తీసుకోవాలి.. అలాగే జుట్టు కూడా అంతే ఇది గుర్తుంచుకుంటే మంచిది..