TELANGANA CONGRESS | TELANGANA CONGRESS కి ఇప్పుడు హైదరాబాద్‌లో కొత్త తలనొప్పి మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్
పరిధిలో టికెట్ ఆశించి భంగపడిన కాంగ్రెస్ నేతల్లో అసమ్మతి తగ్గడంలేదు. వారంతా తీవ్ర అసంతృప్తిలో ఉండగా.. పార్టీ అగ్రనేతలు బుజ్జగించినా ససేమిరా వినడంలేదు.
టికెట్ రాకపోవడంపై కొందరు నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. మరికొందరు పార్టీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీంతో పార్టీ టికెట్ దక్కిన అభ్యర్థులు కూడా ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సెగ్మెంట్ లో అసమ్మతి నేతలు కలిసి పని చేస్తారో లేదోననే టెన్షన్ మొదలైంది. కొందరు అభ్యర్థులు నేరుగా అసంతృప్త నేతల వద్దకు వెళ్లి మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు.
అధికారంలోకి రావడమే ధ్యేయంగా పార్టీ పని చేస్తుంటే కిందిస్థాయిలో ఇలాంటి అసమ్మతులు పార్టీకి నష్టం చేస్తారని సీనియర్లు కూడా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సిటీలోని జూబ్లీహిల్స్, సనత్‌నగర్, అంబర్‌పేట, మలక్ పేట, ఎల్బీ నగర్ స్థానాల్లో టికెట్ ఆశించిన స్థానిక నేతలు పార్టీపై గుర్రుగానే ఉన్నారు. వీళ్లు రెబల్స్‌గా మారే ప్రమాదం ఉందని కాంగ్రెస్ కంగారుపడుతోంది.
జూబ్లీహిల్స్టికెట్ ఇవ్వకపోవడంతో పీజేఆర్తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి పార్టీపై కోపంతో రగిలిపోతున్నారు. అక్కడ మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఇక మలక్‌పేట నుంచి షేక్ అక్బర్‌కు టికెట్ కేటాయించడంపై కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్ షేక్‌అబ్దుల్లా సోహెల్ గుర్రుగా ఉన్నారు. అంబర్‌పేట పార్టీ సీనియర్ నేత లక్ష్మణ్ యాదవ్, యువ నేత నూతి శ్రీకాంత్ టికెట్ ఆశించారు. కానీ చివరి నిమిషంలో పీసీసీ నేత రోహిణ్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. దాంతో ఈ మూడు స్థానాల్లో రెబల్స్ బరిలో నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.