WOMEN | ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు పెద్దలు. కాబట్టి.. మహిళలు ఎంత ఆనందంగా ఉంటే ఇల్లు అంత సంతోషంగా ఉంటుంది. అందుకే స్త్రీ అంటే ఒక శక్తి స్వరూపిణి అని అంటూ ఉంటారు. ఎప్పుడైనా ఒక ఇంట్లో మగపిల్లాడు పుట్టినప్పుడు కంటే ఆడపిల్ల పుట్టినప్పుడు ఆ ఇంట్లో చాలా ఆనందం కలుగుతుంది అని అందరూ భావిస్తూ ఉంటారు.
మహిళలు నట్టింట్లో ఏడ్చితే ఆ ఇంటికి శని పట్టుకుంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.. అంతేకాదు పురాణాల్లో ఆడవాళ్ల గురించి ఎన్నో విషయాలను చెప్పారు. ఎప్పుడూ వాళ్ళు సంతోషంగా ఉండాలని పెద్ద వాళ్ళు కూడా మనకి తరచూ చెబుతుంటారు. ఆడవారికి చాలా ఓర్పు ఉంటుంది, అందుకే WOMEN ని భూదేవితో కొలుస్తారు అంటే భూమికి ఎంత ఓర్పు ఉంటుందో ఆడవారికి కూడా అంతే ఓర్పు ఉంటుంది.
ఆడవారికి ఎన్ని కష్టాలు ఎదురైనా ఎంతో సులువుగా వాటిని దాటుతూ ఉంటారు. కానీ స్త్రీలు ఎప్పుడైతే ఇంట్లో సంతోషంగా ఉండరో, గొడవలు పడుతూ ఉంటారో అటువంటి సమయంలో ఎలాంటి సంతోషాలు ఉండవు. ఎప్పుడైతే స్త్రీ నుండి నెగిటివ్ ఎనర్జీ వస్తుందో అప్పుడు వారికి మాత్రమే కాకుండా ఆ ఇంటికి కూడా మంచిది కాదు. అందుకే ఇంట్లో పెద్దలు ఆడవారు ఏడవడం వల్ల ఇంటికి అరిష్టమని చెబుతూ ఉంటారు.. కాబట్టి స్త్రీలు ప్రతి చిన్న విషయాన్ని మనసుకు తీసుకోకపోవడం మంచిది. ఆడవాళ్లు ఏడ్చారంటే దానికి ఎంతో బలమైన కారణం ఉండాలి.. కుటుంబ సంతోషాన్ని దృష్టిలో మహిళలను ఆనందంగా ఉంచే బాధ్యత మగవారిదే.. ఇది గుర్తుంచుకోండి..