KADAPA DISTRICT | బస్సు నిలపలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఓ ఉపాధ్యాయుడు దాడి చేసిన సంఘటన KADAPA DISTRICT చక్రాయపేట మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై వినోద్‌కుమార్ వివరాలు ప్రకారం.. రాయచోటి-వేంపల్లె ప్రధాన రహదారిపై నాగలగుట్టపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద బుధవారం సాయంత్రం రాయచోటి నుంచి వేంపల్లె వెళ్తున్న బస్సును నిలపాలని తెలుగు ఉపాధ్యాయుడు రామ్మోహన్ కోరాడు.
డ్రైవర్ బస్సు ఆపకుండా వెళ్లడంతో ద్విచక్రవాహనంపై వెంబడించి బస్సు ఎందుకు ఆపలేదని కండక్టర్‌తో వాగ్వాదానికి దిగాడు. డ్రైవర్ నరసింహులు జోక్యం చేసుకుని రద్దీ ఉండటంతో బస్సు ఆపలేదని సమాధానమిచ్చారు. దీంతో ఆగ్రహించి ఉపాధ్యాయుడు డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఇరువురిని స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటనపై విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.