MP PRABHAKAR REDDY | తెలంగాణలో సంచలనం సృష్టించిన మెదక్ MP PRABHAKAR REDDY పై కత్తిపోటు వెనుక అసలు కారణాన్ని పోలీసులు బయటపెట్టారు. బెంగాల్ టైగర్ సినిమాలో హీరో రవితేజ ఫేమస్ అవ్వడానికి మంత్రిగా ఉన్న షియాజీ షిండేపై రాయి విసిరినట్లు.. సంచలనం కోసమే నిందితుడు రాజు ఎంపీని కత్తితో పొడిచినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు సిద్ధిపేట పోలీస్ కమిషనర్ శ్వేత మీడియా సమావేశంలో కత్తిపోటుకి గల కారణాలు వివరించారు.
నిందితుడు రాజు కొన్ని సోషల్ మీడియా ఛానెళ్లలో పని చేస్తున్నాడని సీపీ శ్వేత వెల్లడించారు. అలానే అతనికి ఎవరి సహకారం లేదని.. వారం రోజుల క్రితమే కత్తి కొని MP PRABHAKAR REDDY పై దాడికి పథకం రచించాడని సీపీ తెలిపారు. దాడి తర్వాత రాజుకి స్థానికులు దేహశుద్ధి చేయడంతో గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స అనంతరం పోలీసులు అతడిని కోర్టులో హాజరు పరిచారు. అనంతరం రిమాండ్ కి తరలించారు.
మరోవైపు దాడి అనంతరం ఎంపీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన మరికొన్ని రోజులు ఐసీయూలోనే ఉండాల్సిన పరిస్థితి. దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న ప్రభాకర్ రెడ్డి వారం తర్వాత మళ్లీ ప్రచారానికి హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.