BABU MOHAN | కమెడియన్, సీనియర్ నేత బాబు మోహన్ బీజేపీ అధిష్టానాన్ని బెదిరించి మరీ తెలంగాణ ఎన్నికల్లో
టికెట్ దక్కించుకున్నారు. నిన్న బీజేపీ 35 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో బాబు మోహన్ పేరు ఉండడం చూసి పార్టీ నేతలే ఆశ్చర్యపోయారు.
ఆందోల్ నియోజకవర్గం నుంచి బాబు మోహన్ టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో BABU MOHAN మూడో ప్లేస్‌కు పడిపోవడంతో టికెట్ దక్కదనే ప్రచారం విస్తృతంగా సాగింది.
నిజానికి బాబు మోహన్ కుమారుడికి టికెట్ ఇస్తారని అంతా అనుకున్నారు. అలానే పార్టీ నేతలు కూడా ప్రచారం చేయడంతో బాబు మోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల 28న మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ సీరియస్ నిర్ణయం తీసుకున్నానని.. ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దాంతో ఇక అతను పోటీ చేయడని అంతా అనుకున్నారు.
తెలంగాణలో తనకంటూ ఒక ఇమేజ్ వుందని, టికెట్ ఇవ్వడానికి ఒకటి, రెండు జాబితాలంటూ కాలయాపన చేయడం ఏంటని నిలదీశారు. దీంతో ఆయనపై బీజేపీ క్రమశిక్షణ చర్య తీసుకుంటుందని అంతా అనుకున్నారు. అలాంటివేవీ జరగకపోగా, అనూహ్యంగా ఆందోల్ టికెట్‌ను ఆయనకే ఇచ్చింది. మొత్తానికి బాబు మోహన్ బీజేపీ అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేసి టికెట్ సాధించుకున్నారు.