BRS | తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముంగిట బీఆర్ఎస్కి కేంద్ర ఎన్నికల సంఘం గుడ్‌న్యూస్ చెప్పింది. హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కి తలనొప్పిగా మారిన సింబల్స్‌ని పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించేందుకు 193 గుర్తులతో కూడిన ఫ్రీ సింబల్స్ జాబితాను ఈసీ తాజాగా ప్రకటించింది.
కానీ.. ఈ సింబల్స్‌లోBRS కారు గుర్తుని పోలి ఉన్న ఆటో రిక్షా, హ్యాట్, ఇస్త్రీ పెట్టె, ట్రక్కు గుర్తులను రెండు రాష్ట్రాల్లో ఎవరికీ కేటాయించట్లేదని ఈసీ స్పష్టం చేసింది. పైన పేర్కొన్న ఆ నాలుగు గుర్తులను ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి మినహాయిస్తున్నట్లు ఈసీ క్లారిటీగా ప్రకటించేసింది.
ఆటో, హ్యాట్, ఇస్త్రీపెట్టె, ట్రాక్‌కు గుర్తులు కంటి చూపు సరిగా లేని వారికి కారు మాదిరిగానే కనిపిస్తోందని.. దీని వల్ల పార్టీకి పడాల్సిన ఓట్లు ఆయా గుర్తులకు పడుతున్నాయని.. దీంతో నష్టపోతున్నామని గతంలోనే ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ లేఖ రాసింది. బీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించిన ఈసీ తెలంగాణ ఎన్నికల్లో ఆ నాలుగు గుర్తులను ఎవరికీ కేటాయించకూడదని నిర్ణయం తీసుకున్నారు