CONGRESS | తెలంగాణలో ఓ దిశ దశ లేకుండా ఉన్న వామపక్షాలకి కాంగ్రెస్ లాస్ట్ మినిట్‌లో హ్యాండిచ్చింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటుందని అంతా ఊహించారు. బీఆర్ఎస్ను ఎదుర్కోవాలంటే వామపక్షాల సహకారం కూడా అవసరమని కాంగ్రెస్ పార్టీ తొలుత భావించింది. కానీ.. 5-6 సీట్లని వామపక్షాలు అడగడం.. అవి కూడా కాంగ్రెస్ గెలిచే స్థానాలే కావడంతో అసలు సమస్య మొదలైంది. బీజేపీ, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లు వలసలు పెరగడం కూడా వామపక్షాల పొత్తు అవకాశాల్ని దారుణంగా దెబ్బతీశాయి.
నిజానికి కాంగ్రెస్ చాలా తెలివిగా.. సాహసోపేతంగా ఎన్నికల వ్యూహరచన చేస్తోంది. తొలుత వైఎస్ షర్మిల పార్టీని విలీనం చేసుకుంటామని చెప్పి ఆ తర్వాత వదిలేసింది. ఇప్పుడు వామపక్షాలను కూడా లాస్ట్ మినిట్ వరకూ ఊరించి వదిలేసింది. దాంతో విసిగిపోయిన సీపీఎం ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నది. సీపీఐలో మాత్రం ఇంకా ఆశ చావలేదేమో.. పోటీపై ఇంకా ప్రకటన చేయలేదు.
రాష్ట్రంలోని 17 సీట్లలో పోటీ చేయాలని సీపీఎం నిర్ణయం తీసుకున్నది. సీపీఎంకు ఆయా నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్‌తో పాటు ఓటు బ్యాంకు కూడా ఉన్నది. కాంగ్రెస్ కలిసొస్తే కనీసం రెండు మూడు సీట్లు గెలుచుకుంటామని అంచనా వేసుకుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ హ్యాండ్ ఇవ్వడంతో ఒంటరి పోరుతో అయినా లాభపడాలని సీపీఎం భావిస్తోంది.