CYBERABAD CYBER CRIME NEWS | సైబర్ నేరగాళ్లకి చదువుకోని వారే కాదు.. ఐపీఎస్‌లు కూడా చిక్కిపోతున్నారు. హైదరాబాద్‌లో ఓ ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారి సైబర్ నేరగాళ్ల వలలో పడ్డారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వాట్సప్ వీడియో కాల్ రావడంతో సదరు అధికారి ఎత్తారు. ఓ మహిళ నగ్నంగా దర్శనమివ్వడంతో వెంటనే కట్ చేశారు. కానీ ఈలోపే ఆ కాల్‌ను రికార్డు చేసి, డబ్బులివ్వకపోతే సామాజిక మాధ్యమాల్లో పెడతామంటూ బెదిరింపులకు దిగడంతో.. సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.
మరోచోట పని చేస్తున్న బ్యాంకుకే టోకరా వేశాడు బిహార్‌లోని గోపాల్‌గంజ్ సెంట్రల్ కో- ఆపరేటివ్ బ్యాంకు మేనేజర్. ఖాతాదారుల అకౌంట్ల నుంచి సుమారు రూ.3 కోట్లు తన బంధువుల ఖాతాల్లోకి బదిలీ చేశాడు. దీంతో అతడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ విషయంలో మేనేజర్‌కు సహకరించిన మరో ఇద్దరిపైనా వేటు వేశారు. ఇప్పటి వరకు సుమారు రూ.85 లక్షలు రికవరీ చేసినట్లు తెలుస్తోంది.
బ్యాంకు మేనేజర్ మోసం గురించి తెలుసుకున్న మేనేజ్మెంట్ బోర్డు.. నాబార్డుకు సమాచారం అందించింది. ఈ విషయంపై నాబార్డు.. దర్యాప్తు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. విచారణలో బ్యాంకు మేనేజర్.. ఇతర ఉద్యోగులతో కలిసి సుమారు రూ.3 కోట్లను ఖాతాదారుల అకౌంట్ల నుంచి తన బంధువుల ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నట్లు తెలిసింది.