BRS | తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తెలివిగా CONGRESS ని దెబ్బకొట్టేందుకు ఈసారి ప్లాన్ మార్చింది. ఏకంగా 42 మంది రెడ్డి సామాజిక వర్గ నాయకులకు సీట్లు ఇచ్చింది. కానీ.. కమ్మవారిపై శీతకన్ను వేస్తూ కేవలం ఐదుగురు నేతలకు మాత్రమే సీట్లు ఇచ్చింది. ఇది గ్రహించిన కాంగ్రెస్ పార్టీ కూడా రెడ్లకు గణనీయమైన సీట్లే ఇచ్చింది. అలానే కమ్మవారినీ తమవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యింది.
తెలంగాణలో గతంలో ఎప్పుడూ ఇలాంటి రాజకీయ పరిస్థితి కనిపించలేదు. ఏపీలో చంద్రబాబుని రాజకీయంగా సీఎం కేసీఆర్, బీజేపీ ఇబ్బంది పెట్టిందనే అక్కసు కమ్మ వర్గంలో ఇప్పుడు బలంగా ఉంది. అందుకే రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పడానికైనా కాంగ్రెస్కు ఓట్లు వేసి తీరాలనే పట్టుదలతో ఆ వర్గం ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇక బాబు శిష్యుడైన రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వడానికి వాళ్లు రెడ్డి సామాజిక వర్గం రెడీగా ఉంది. ఇది ముందుగానే గ్రహించిన BRS అత్యధికంగా రెడ్లకి టికెట్లు కేటాయించినా.. ప్రయోజనం కనిపించడం మాత్రం లేదు. దానికి కారణాలు కూడా లేకపోలేదు. ఏపీలో జగన్ ప్రభుత్వంపై తరచూ విమర్శలు గుప్పిస్తుండటంతో వాళ్లు కేసీఆర్పై గుర్రుగా ఉన్నారు. మొత్తానికీ కేసీఆర్ అనుకున్నది ఒక్కటి.. ప్రస్తుతం జరుగుతోంది మరొకటి.