HYDERABAD NEWS | తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు వైన్స్, బార్లు మూతపడబోతున్నాయి. ఈ మేరకు లైసెన్స్‌దారులకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఈ నెల 28 నుంచి 30 వరకు వైన్ షాపులు, బార్లు మూసివేస్తున్నారు. నవంబర్ 28న సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 30న పోలింగ్ ముగిసే వరకు వైన్ షాపులు, బార్లు మూసి ఉండనున్నాయి. అలానే డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉండటంతో ఆ రోజు కూడా వైన్ షాపులు మూసివేయనున్నారు.
తెలంగాణలో పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 48 గంటల పాటు మద్యం విక్రయాలపై పూర్తిగా నిషేధం విధించాలని.. అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులను ఇప్పటికే ఆదేశించింది. మరోవైపు నోటిఫికేషన్ విడుదల కావడంతో తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ కూడా మొదలైంది.
నవంబర్ 10 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 13న నామినేషన్ల పరిశీలన, 15న విత్‌డ్రాకు చివరితేదీగా నిర్ణయించారు. నవంబర్ 30న రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. డిసెంబర్ 5 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.