KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండనున్నారు. సిద్దిపేట జిల్లాలోని కొనాయపల్లిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆనాదిగా కేసీఆర్‌కి సెంటిమెంట్‌గా వస్తోంది. అక్కడ పూజలు చేసిన తర్వాతే నామినేషన్ దాఖలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. దాంతో ఈరోజు అక్కడ ప్రత్యేక పూజలు చేయనున్నారు.
ఈనెల 9న కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనుండగా ఈరోజు వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆ నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా ఈసారి కేసీఆర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. రెండు నియోజకవర్గాలకు గంటల వ్యవధిలోనే ఈ నెల 9న నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
గత కొన్ని రోజులుగా అవిశ్రాంతంగా బహిరంగ సభల్లో కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కాంగ్రెస్ నుంచి ఈసారి గట్టి పోటీ ఉండటంతో ఎన్నికలు ముగిసే వరకు సీఎం కేసీఆర్ బిజీబిజీగా ప్రచారం చేయబోతున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని కవర్ చేసేలా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే కేసీఆర్ షెడ్యూల్‌ని కూడా రెడీ చేశారు.