CONGRESS | తెలంగాణ ఎన్నికల్లో వలసలు వేగం పుంజుకున్నాయి. అధికారం రేసులో CONGRESS చాలా ముందున్నట్లు కనిపిస్తోంది. దాంతో గతంలో ఆ పార్టీని వీడి బీఆర్ఎస్, బీజేపీలో చేరిన నేతలు మళ్లీ సొంతగూటికి క్యూ కడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ ఇటీవల బీజేపీ నుంచి మళ్లీ కాంగ్రెస్లోకి జంప్ కొట్టేశారు.
నిజానికి ఈ ఇద్దరూ పార్టీ మారబోతున్నట్లు మొదటి నుంచి ప్రచారం జరిగినా.. ఇద్దరూ చాలా కాన్ఫిడెంట్గా ఆ వార్తల్ని కొట్టిపారేస్తూ వచ్చారు. కానీ.. వారం వ్యవధిలో పార్టీ మారిపోయి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు అదే తరహాలో డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లు కూడా ఖండిస్తున్నారు. కానీ.. ఇద్దరి చూపు మాత్రం ప్రస్తుతం హస్తం వైపు ఉన్నట్లు కనిపిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని డీకే అరుణ ప్రకటించినప్పుడే ఆమె కాంగ్రెస్లోకి వెళ్తుందని జోరుగా ప్రచారం నడిచింది. ఒకవేళ బీజేపీ తరఫున డీకే అరుణ గెలిచినా సరే.. రాష్ట్రంలో సింపుల్ మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆమె కాంగ్రెస్లోకి జంప్ అయిపోవడం సులువే. ఇక మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి .. తిరిగి ఎప్పుడు కాంగ్రెసులోకి వెళ్తారనేది వేచి చూడాలి. ఆయనకు ఎంపీ సీటు ప్రధానం కాబట్టి.. ఈ ఎన్నికల తర్వాత.. తేలబోయే బలాబలాలను బట్టి ఆయన ఫిరాయింపు ఉంటుందని సమాచారం. మొత్తానికి కాంగ్రెస్ నుంచి బలమైన నాయకుల్ని పార్టీలోకి చేర్చుకున్నప్పటికీ వారిని కాపాడుకోవడంలో బీజేపీ మళ్లీ మళ్లీ ఫెయిల్ అవుతోంది