TS ELECTIONS 2023 | తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బాగా వెనకబడిపోయిన బీజేపీ.. బీసీని సీఎం చేస్తామని ప్రకటించినా పెద్దగా ఆదరణ కనిపించడం లేదు. నిజానికి బీసీ సీఎం అని ప్రకటించగానే బండి సంజయ్, ఈటల రాజేందర్ లాంటి నేతలకు హుషారు వస్తుందని అధిష్టానం అనుకుంది. కానీ.. రాష్ట్రంలో బీజేపీ గెలిచే సీన్ లేదని ఇప్పటికే తేలిపోయింది. ఏ సర్వే చూసినా.. బీజేపీ 10-15 సీట్లకి మించి గెలిచే అవకాశం లేదని తెలుస్తోంది.
నిజానికి బీజేపీ ఇలా వెనకబడిపోవడానికి కారణం అధిష్టానం అనాలోచిత నిర్ణయాలే. ఎన్నికల ముంగిట తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ని తప్పించడం ఆ పార్టీని దారుణంగా దెబ్బతీసింది. రాష్ట్రంలో దూకుడుగా వ్యవహరించిన బండి సంజయ్.. బీఆర్ఎస్కి సవాల్, ప్రతి సవాల్‌తో కేడర్‌లో ఉత్సాహం నింపారు. కానీ.. కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆ దూకుడు పార్టీలో కనిపించలేదు.
అమిత్ షా స్వయంగా బీసీ వ్యక్తి సీఎం అంటూ ప్రకటించినా.. పెద్దగా నేతలు ఎవరూ రియాక్ట్ అవడం లేదు. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ గెలిచే సీట్లెన్ని..? ఆ పార్టీ అధికారంలోకి వస్తుందా..?
అంటే లేదనే సమాధానం ప్రతిచోటా వినిపిస్తోంది. దాన్ని కప్పి పుచ్చుకునేందుకు దమ్ముంటే కాంగ్రెస్‌ని కూడా బీసీ సీఎం అని ప్రకటించమనండి అంటూ లక్ష్మణ్ వంటి నేతలు సవాళ్లు విసురుతున్నారు. కానీ.. గెలుపు రేసులో చాలా ముందున్న కాంగ్రెస్ ఆ సవాల్‌ని లైట్ తీసుకుంటోంది